గోల్డెన్ హ్యాండ్ గా ముద్రేసుకున్న దిల్ రాజు మరో భారీ చిత్రాన్ని దక్కించుకున్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో హిందీ త్రి ఇడియట్స్ రీమేక్ గా రూపొందిస్తున్న 3 రాస్కెల్స్ చిత్ర ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని దిల్ రాజు తీసుకున్నారు. తమిళ నటులు విజయ్, శ్రీకాంత్, జీవా ఇందులో హీరోలుగా నటించారు. ఇలియానా హీరోయిన్ గా నటించింది. హ్యారీస్ జయరాజ్ సంగీతమందించాడు. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా జనవరి 26న విడుదల చేయనున్నారు. శంకర్ బ్రాండ్ ఇమేజ్ కు గోల్డెన్ హ్యాండ్ దిల్ రాజు కూడా చేరడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తనదైన పబ్లిసిటీతో దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నాడు. ఇప్పటివరకు శంకర్ దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ఇలియానా తన అందచందాలతో ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ కానుందట. ఇందులో ఇలియానా డిఫరెంట్ లుక్ తో మరింత గ్లామరస్ గా కనిపించనుంది.