Sunil's Poolarangadu is not releasing for Sankranthi


సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న పూలరంగడు
      సంక్రాంతి బరినుంచి సునీల్ తప్పుకున్నాడా... ఔననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. మహేష్, వెంకటేష్, రవితేజ వంటి బడా హీరోలకు పోటీనిచ్చేందుకు పూలరంగడి రూపంలో సునీల్ సంక్రాంతి బరికి వద్దామనుకున్నాడు. కానీ తన కోరిక తీరేలా కనిపించట్లేదు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మిగిలి ఉండడంతో పాటు... థియేటర్ల సమస్య కూడా ఏర్పడనుంది. బిజినెస్ మేన్, బాడీగార్డ్, నిప్పు చిత్రాల్ని భారీ స్థాయిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. దీంతో పూలరంగడుకి మంచి థియేటర్లు దొరికే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే... పూలరంగడుని కాస్త వెనక్కి నెట్టారని సమాచారం. అహా నా పెళ్లంట తర్వాత వీరభద్రమ్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. ప్రేమ కావాలి ఫేం ఇషా చావ్లా సునీల్ సరసన నటిస్తోంది.

0 comments

Leave a Reply

Copyright 2011 www.AndhraFunda.com All rights reserved