కొలవెరి డీ పాట ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు రెండున్నర కోట్లమంది యూట్యూబ్ లో ఈ పాటను వీక్షించారు. ఇటీవలే ముంబైలో హీరో ధనుష్ ఈ పాటను లైవ్ పెర్ ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. ఈ కొలవెరి వెర్రి ఇప్పుడు పాకిస్తాన్ కు కూడా పాకింది. ఈ పాటను వారి భాషలోకి మార్చుకొని పాడుతున్నారు. ఈ పాట సృష్టించిన రికార్డుకు ఇటీవలే యూట్యూబ్ గోల్డ్ అవార్డ్ తో సత్కరించింది. ఇవన్నీ పక్కన పెడితే... కొలవెరి పాట మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఈ పాట గురించి మేనేజ్ మెంట్ స్టూడెంట్స్ స్టడీ చేయనున్నారు. ఇంతగా సంచలనం సృష్టించిన ఈ పాట నేపథ్యం దగ్గరినుంచి పబ్లిసిటీ వరకు అన్ని విషయాల్ని రీసెర్చ్ చేయనున్నారు. ఈ పాట సక్సెస్ ఫార్ములా గురించి బిజినెస్ మేనేజ్ మెంట్ విద్యార్థులకు పాఠాలుగా చెప్పనున్నారు.
'Kolaveri Di' goes to Business Schools
Posted by
Anonymous
on 8:14 AM
0
comments
0 comments
Leave a Reply

