వెంకటేష్ కు భార్యగా అమలా పాల్ బాగుంటుందా?

వెంకటేష్ భార్యగా అమలా పాల్...
వెంకటేష్ భార్యగా నటించే అదృష్టం చివరికి అమలా పాల్ కు దక్కింది. ప్రేమఖైదీ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమలా పాల్.... ఆ తర్వాత బెజవాడ చిత్రంతో నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బెజవాడ చిత్రంలో పెద్ద క్యారెక్టర్ కాకపోయినా.... సినిమాకున్న క్రేజ్ తో అందరి దృష్టిలో పడింది. ఇప్పుడీ బ్లాక్ బ్యూటీని వరుస ఆఫర్స్ వరిస్తున్నాయి. తాజాగా సిద్ధార్థ తో కలిసి లవ్ ఫెయిల్యూర్ అనే చిత్రంలో నటిస్తోంది. చాలామంది కుర్ర హీరోలు అమలా పాల్ తో కలిసి నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. యంగ్ హీరోలు సరే... సీనియర్ హీరో వెంకటేష్ సైతం అమలా పాల్ తో కలిసి నటించేందుకు ఒప్పకున్నాడట. కొత్తబంగారు లోకం ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్ కు జోడీగా సమంతా నటిస్తోంది. అయితే... వెంకీ సరసన నటించే హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ ఇన్నాళ్లు కొనసాగింది. వెంకీకి భార్యగా నటిస్తున్నారంటూ.... పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు సైతం బయటికొచ్చాయి. అంతేకాదు.. భూమిక పేరు కూడా వినిపించింది. ఇక అనుష్క ఫైనల్ అయినట్టేనని ఊహాగానాలు వినిపించాయి. వెంకీ సీనియారిటీని దృష్టిలో ఉంచుకొని... కాస్త సీనియర్ హీరోయిన్ల కోసమే ట్రై చేశారు. ఎందుకంటే... మహేష్ కు అన్న పాత్రలో వెంకీ నటిస్తున్నాడు. మహేష్ వదినగా కూడా కుదరాలి. అందుకే... వెంకీకి సరైన జోడీ కోసం ఇన్నాళ్లు వెతికారు. కానీ.. నిర్మాత దిల్ రాజు ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. నిన్నగాక మొన్న టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్ ను వెంకీకి జోడీగా సెలెక్ట్ చేశారు. అంటే మహేష్ కు అమలా పాల్ వదిన అన్నమాట. ఈ కాంబినేషన్ పూర్తిగా సంతృప్తి పరిచేలా లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే కథ మీద దర్శక నిర్మాతలకున్న నమ్మకంతోనే... అమలాపాల్ ను సెలెక్ట్ చేశారట. వెంకీ అమలా పాల్ మధ్య కెమిస్ట్రీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో మరి.

0 comments

Leave a Reply

Copyright 2011 www.AndhraFunda.com All rights reserved