స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ పై ఆర్.నారాయణ మూర్తి దర్శకత్వంలో విడుదలైన చిత్రం పోరు తెలంగాణ. ఈ చిత్రాన్ని రెండోసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. డిసెంబర్ 31న రెండో సారి ప్రేక్షకుముందుకు రానుంది.
దీని గురించి నారాయణమూర్తి మాట్లాడుతూ... 'సెప్టెంబర్ లో విడుదల చేసిన పోరు తెలంగాణ చిత్రం బందులు, ఇతర కారణాల వల్ల ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందలేకపోయింది. ఈ కారణంతో ఈ సినిమాను డిసెంబర్ 31న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ విడుదలకు నైజాం, వైజాగ్, రాయలసీమ నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. తెలంగాణ ఉద్యమం న్యాయమైందని ఈ సినిమా చెబుతుంది. ప్రాంతీయ స్వార్థంతో నేను ఈ సినిమా గురించి చెప్పడం లేదు. కళాకారుడిగా చెప్తున్నాను. ఈ సినిమాని చూసి ఆదరించండి'.

