![]() |
| ఫిబ్రవరిలో వస్తోంది.... |
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్, ఆనంద్, గోదావరి, లీడర్ చిత్రాలన్ని విజయవంతమయ్యాయి. అయినా దర్శకుడు శేఖర్ కమ్ముల అజ్ఞాతంలో ఉన్నాడు. ఒక్క సినిమా హిట్టయితే చాలు... స్టార్ డైరెక్టర్ లా బిల్డప్ ఇచ్చుకుంటూ ఏప్పుడూ వార్తల్లో ఉంటారు. కానీ శేఖర్ కమ్ముల స్కూల్ వేరు. ప్రచారానికి దూరంగా తన తాజా చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసేశాడు. లీడర్ సినిమా తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమా స్టార్ట్ చేశారు. ఇందులో అందరూ కొత్తవారే నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయం కూడా బయటికి రానీయలేదు. సైలెంట్ గా షూటింగ్ సైతం పూర్తి చేసేశారు. ఈ చిత్రానికి సంబంధించి ఒక్క స్టిల్ కూడా బయటికి రాకపోవడంతో... ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. సినిమా ఎలా ఉండనుందనే ఆసక్తి పెరిగింది. శేఖర్ కమ్ముల బ్రాండ్ నేమ్ తోనే సినిమాలు ఆడేస్తాయనే నమ్మకముంది. శేఖర్ రూపొందించే చిత్రాలకు.. ఏ సెంటర్స్ తో పాటు... ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు రూపొందిస్తున్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సైతం క్లాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకొనే రూపొందిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. కానీ సినిమాకు సంబంధించిన వర్క్ పూర్తి కాకపోవడంతో... విడుదల తేదీని వాయిదా వేశారు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. పేరు క్లాస్ గా ఉన్నా ఈ చిత్రం అన్ని వర్గాల్ని ఆకట్టుకుంటుందా లేక మల్టీప్లెక్స్ ఆడియెన్స్ ను మాత్రమే మెప్పిస్తుందా అనేది తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు.

