సెన్సార్ పూర్తి చేసుకున్న వీడింతే
పరమ్ వి పొట్లూరి సమర్పణలో విక్రమ్, కె.విశ్వనాథ్, దీక్షాసేథ్ ప్రధాన పాత్రల్లో... దర్శకుడు సుశీంద్రన్ రూపొందిస్తున్న చిత్రం వీడింతే. ఈ నెలాఖరుకు రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి చిత్ర ప్రొగ్రెస్ తెలియజేస్తూ.. 'చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులను ఆద్యంతం మెప్పించిన ఈ చిత్రం క్లీన్ యు సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. విక్రమ్, కె.విశ్వనాథ్ ల నటన చిత్రానికి హైలైట్ కానుంది. ఈ చిత్రాన్ని ఈనెలాఖరుకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు నచ్చే, మెచ్చే అన్ని కమర్షియల్ విలువలతో వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఈ చిత్రంలో శ్రియా, రీమాసేన్, సలోనీ ప్రత్యేక పాటల్లో కనువిందు చేయనున్నారు'.

