NAGARJUNA LEAVES FOR VARANASI

నేను లేకపోయినా నో ప్రాబ్లం 
నాగార్జున రాజన్న ఈనెల 22న విడుదలకు సిద్ధమౌతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పబ్లిసిటీ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇప్పటికే నాగార్జున అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. రెండు రోజుల ముందుగానే ఈ చిత్ర ప్రీమియర్ షోను సైతం ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు. అక్కినేని నాగేశ్వరరావుతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించారు. అయితే రాజన్న రిలీజ్ రోజున నాగ్ ఆంధ్రప్రదేశ్ లో ఉండట్లేదు. ఎందుకంటే వారణాసిలో డమరుకం షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్లారు. రాజన్న విడుదలైన ఒకట్రెండు రోజుల తర్వతే నాగ్ హైదరాబాద్ రానున్నారు. తానే నిర్మాత కావడంతో ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. అంతేకాదు ఈ సినిమా విజయంపై నాగ్ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. అందుకే రిలీజ్ సమయంలో అందుబాటులో లేకపోయినా పెద్దగా నష్టం ఉండదని నాగ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 

0 comments

Leave a Reply

Copyright 2011 www.AndhraFunda.com All rights reserved