MM Srilekha's Happy New Year Song 2012


           ఎం.ఎం.శ్రీలేఖ న్యూ ఇయర్ స్పెషల్ సాంగ్  విడుదల 


ప్రముఖ గాయని , సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ  నూతన 
సంవత్సర కానుకగా ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. తొలి అడుగైన, తొలివలపైనా జీవితంలో తొలి సంఘటనలు  ఎంతో మధురం  అనే కాన్సెప్ట్ తో  ఈ నూతన సంవత్సరం లో తొలి రోజు ఎన్నో ఆనందాలకి నాంది కావాలి అంటూ ఓ గీతాన్ని ఆలపించారు. ఎప్పటినుండో ఓ ప్రైవేట్ ఆల్బం  రూపొందించాలన్న తన ఆలోచనకు ఈ పాట తొలి అడుగు అని శ్రీలేఖ అన్నారు. ప్రముఖ రచయిత సిరాశ్రీ రచించిన ఈ గీతాన్ని శ్రీలేఖ ఆలపించారు.  హైదరాబాద్  లో పలు  లోకేషన్లలో ఈ పాటని చిత్రీకరించారు. ఇప్పటి వరకూ తెరవెనుక గాయనిగా  , సంగీత దర్శకురాలిగా  ప్రీక్షకులకు, శ్రోతలకు పరిచయమైన శ్రీలేఖ ఈ తొలి ఆల్బం ద్వారా  ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  ఈ నూతన సంవత్సరం  తనకు ప్రేక్షకులకు  మంచి జరగాలని, అందరూ హ్యాపీ గా ఉండాలనే ఆకాంక్ష తో  ఈ పాటని రూపొందించానని అన్నారు .

0 comments

Leave a Reply

Copyright 2011 www.AndhraFunda.com All rights reserved