Manchu manoj want BIG hit


మంచు మనోజ్... ఈ పేరుకు ముందు మంచు అనే ఇంటిపేరు లేకపోతే... హీరో అనే విషయాన్ని గుర్తుపట్టడం కష్టమే. ఇప్పటిదాకా ఓ పది చిత్రాల్లో హీరోగా నటించిన మంచు మనోజ్.. భారీ కమర్షియల్ సక్సెస్ ఇంకా అందుకోలేదు... అయితే... ప్రతీ చిత్రంతో ఏదో ఓ ప్రయోగం చేస్తూ... కొత్తదనం కోసం ట్రై చేస్తుంటాడు. ఈ విషయంలో మనోజ్ ను అభినందించక తప్పదు. కానీ అనుకున్న స్థాయి విజయం మాత్రం ఎంత ప్రయత్నించినా దక్కట్లేదు. అయతే సక్సెస్ దక్కలేదని ప్రయత్నాలు, ప్రయోగాలు చేయడం మాత్రం మానట్లేదు.
మనోజ్ ప్రస్తుతం నటిస్తోన్న మిస్టర్ నోకియా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా పోస్టర్స్, స్టిల్స్ లో మనోజ్ కొత్త లుక్స్ తో సరికొత్తగా కనిపిస్తున్నాడు. స్టైలింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాడు. హెయిర్ స్టైల్ ను పూర్తిగా మార్చేశాడు. ఈ సినిమాలో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తో కనిపించనున్నాడు. లుక్స్ తో పాటు మనోజ్ క్యారెక్టర్ సైతం డిఫరెంట్ గా ఉండనుందట. అంతేకాదు... ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ హిట్ ఈ సినిమాతో దొరకనుందని మనోజ్ ధీమాగా ఉన్నాడు. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం పెద్ద అస్సెట్ కానుంది. అని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. 

0 comments

Leave a Reply

Copyright 2011 www.AndhraFunda.com All rights reserved