రోడ్డు ప్రమాదంలో కోమటి రెడ్డి కుమారుడు మృతి
కోమటి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి (19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ప్రతీక్ తో సహా మరో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కిమ్స్ కు తరలించారు. సిబిఐటి నుంచి పటాన్ చెరు వస్తుండగా సాయంత్రం 5:30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఏపి 24 ఏహెచ్ 9999 స్కోడా కారులో వీరు ప్రయాణిస్తున్నారు. మెదక్ కొల్లురు వద్ద గొర్రెల్ని తప్పించబోయి డివైడర్ ని ఢీకొని కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రతీక్ సీబీఐటీలో బీటెక్ మొదటి సంవత్సరం చుదువుతున్నాడు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ నుంచి బయలు దేరారు. కోమటి రెడ్డితో పాటు రాజగోపాలరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం హైదరాబాద్ వస్తున్నారు. కొమటిరెడ్డికి ఒక కుమారుడు, కూతురు. కోమటి రెడ్డి స్వస్థలం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రతీక్ రెడ్డి మృతితో నల్గొండ జిల్లాలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రతీక్ రెడ్డి మృతికి సీఎంతో సహా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు.
