KOLAVERI DI PARODY BY SUNIL


కొలవెరి పాటకు సునీల్ స్టెప్పులు


హీరో ధనుష్ కొలవెరి పాటతో సంచలనం సృష్టించాడు. ఇప్పటికే ఈ పాట ఆధారంగా అనేక పేరడీ పాటలు, వీడియోలు పుట్టుకొచ్చాయి. ఈ పాటను ఇతర చిత్రాలు సైతం క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా హీరో సునీల్ నటిస్తున్న పూలరంగడులో కొలవెరి పాటను పేరడీ చేశారు. ఈ పాటను సునీల్ పై చిత్రీకరించారట. ఈ పాట అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ చెబుతోంది. కొలవెరి బూమ్ ని దర్శక నిర్మాతలు పేరడీ రూపంలో క్యాష్ చేసుకుంటున్నారు. సరదాగా సాగే  ఈపాట సినిమాకు హైలైట్ కానుందట.  సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రంలో సునీల్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్నాడు. ఇటీవలే సునీల్ సిక్స్ ప్యాక్ తో ఉన్న స్టిల్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సిక్స్ ప్యాక్ సినిమాకు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి. 

0 comments

Leave a Reply

Copyright 2011 www.AndhraFunda.com All rights reserved