నాగ్ డిసెంబర్ సెంటిమెంట్ ఫలించేనా...




      డిసెంబర్ నెల నాగార్జునకు ఎంతో ప్రత్యేకం. నాగ్ నటించిన మన్మథుడు, మాస్, డాన్, కింగ్ డిసెంబర్ చివరి వారంలో విడుదలై ఘనవిజయాలు సాధించాయి.  ఈ నేపథ్యంలో రాజన్న సైతం డిసెంబర్ 22న ప్రేక్షకులముందుకొస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు... నాగ్ డిసెంబర్ సెంటిమెంట్ కూడా తోడవ్వడంతో... భారీ ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. నాగ్ ఈ సినిమాను స్వయంగా నిర్మించాడు. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో కొనసాగుతుంది. ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ తండ్రి సుద్దాల హనుమంతు జీవితంలోని కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్ర కథను తయారు చేశారు. ఇప్పటివరకు కథా రచయితగా మంచి విజయాలు అందుకున్న విజయేంద్రప్రసాద్ దర్శకుడిగా వస్తున్న మొదటి చిత్రం. ఇక కీరవాణి అందించిన సంగీతానికి మంచి స్పందన లభించింది. దీంతో పాటు.. యాక్షన్ సన్నివేశాలకు రాజమౌళి దర్శకత్వం వహించడం కూడా ఈ సినిమాను ప్లస్ పాయింట్. ఎన్నో ప్రత్యేకతలతో పాటు నాగ్ కు ఇష్టమైన డిసెంబర్ నెలలో వస్తున్న రాజన్న ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు.... నాగ్ డిసెంబర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా... వెయిట్ అండ్ సీ.......

0 comments

Leave a Reply

Copyright 2011 www.AndhraFunda.com All rights reserved