గొడుగు కింద పుట్టిన నాగార్జున 'మాస్' కథ

నృత్య దర్శకుడిగా తనదైన స్టెప్పులతో అలరించిన లారెన్స్ కు దర్శకుడిగా అవకాశమిచ్చింది నాగార్జున. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే.... నాగ్ లారెన్స్ కు అవకాశమివ్వడంపై అప్పట్లో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే కథ మీద నమ్మకంతో లారెన్స్ కు నాగ్ అవకాశమిచ్చాడు. నాగ్ నమ్మకం నిజమైంది. సినిమా విజయం సాధించింది. అయితే... లారెన్స్ దర్శకుడిగా మారేందుకు వర్షం చాలా సహాయం చేసింది. దర్శకుడుగా మారే సందర్భం విచిత్రంగా జరిగింది. నేనున్నాను సినిమాలోని ఎట్టాగో ఉన్నాది... అనే రీమిక్స్ పాటకు లారెన్స్ నృత్యరీతులు సమకూర్చాడు. ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు సడెన్ గా వర్షం పడింది. అప్పుడు ఇద్దరం ఒకే గొడుకు కింద నిలుచున్నాం. ఆ టైంలో నాగ్ లారెన్స్ ను అడిగాడు.. 'ఏం మాస్టర్ భవిష్యత్తులో ఏం చేద్దామనుకుంటున్నారని'. వెంటనే లారెన్స్... 'మంచి కథ ఉంది బాబు... డైరెక్షన్ అంటే నాకు పిచ్చి.. డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉంది. దానికోసమే వెయిట్ చేస్తున్నా' అనగానే.... సరే కథేంటో నాకు చెప్పు అని నాగ్ అన్నాడు. ఆ గొడుకు కిందే.... పదిహేను నిమిషాలు కథ చెప్పాడు. రామ్ గోపాల్ వర్మ శివ కథ ఎలా చెప్పాడో లారెన్స్ మాస్ సినిమా కథ అలా చెప్పాడట. నాగ్ కు ఆ కథ బాగా నచ్చంది. ఇదే కథను గంటన్నరలో చెప్పమని అడిగాడు. వారం తరవాత పూర్తి కథ చెప్పి నాగ్ ను మెప్పించాడు. వెంటనే నాగ్ మాస్ కథను ఓకే చేశాడు.

0 comments

Leave a Reply

Copyright 2011 www.AndhraFunda.com All rights reserved