ANR's wife Annapurna passes away


అక్కినేని నాగేశ్వరరావుకు సతీ వియోగం






సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య అక్కినేని అన్నపూర్ణ కన్ను మూశారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు. చాలా రోజులుగా ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించడం... ఆమె శరీరం చికిత్సకు అనుకూలంగా లేకపోడడంతో జూబ్లీహిల్స్ లోని ఆమె స్వగృహంలో కన్నుమూశారు. ఆగస్ట్ 14, 1933లో ఆమె దెందులూరు గ్రామంలో జన్మించారు. ఈమె వయస్సు 79 సంవత్సరాలు. ఆమె మరణంతో అక్కినేని కుటంబ సభ్యులతో పాటు... చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగింది. హైదరాబద్ లో లేని అక్కినేని కుటుంబలసభ్యులంతా... ఈ సాయంత్రానికి వచ్చే అవకాశముంది. బెంగళూరులో షూటింగ్ లో ఉన్న నాగార్జున హుటా హుటిన హైదరాబాద్ బయలుదేరారు. 
అన్నపూర్ణ పిక్చర్స్ పేరుతో ఆమె పలు తెలుగు సినిమాలు నిర్మించారు. అన్నపూర్ణతో పెళ్లి తర్వాతే ఎఎన్నార్ కు స్టార్ డమ్ వచ్చింది. ఫిబ్రవరి 18, 1949లో అక్కినేనితో వివాహం జరిగింది. 2009లో వీరు వివాహ వజ్రోత్సవం జరుపుకున్నారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పలువు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. 

0 comments

Leave a Reply

Copyright 2011 www.AndhraFunda.com All rights reserved